కూలీలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
వైరా (విజయక్రాంతి): కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి వైరా మండల పరిధిలోని స్టేజి పినపాక సమీపంలో రోడ్డు పక్కన పంట పొలాల్లోకి దూసుకెళ్లీ పల్టీ కొట్టిన సంఘటనలో కూలీలకు శనివారం పెను ప్రమాదం తప్పింది. ట్రాలీ ముందు టైరు పేలిపోవడంతో వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయలేక పోవడంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది, ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న11మంది మొక్కజొన్న కూలీల్లో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని వ్యవసాయ కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.