calender_icon.png 28 December, 2024 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరుచుకొన్న రత్నభండార్

15-07-2024 01:41:41 AM

  1. పూరీ జగన్నాథ ఆలయంలో  46 ఏండ్ల తర్వాత గదుల తలుపులు తెరిచిన అధికారులు
  2. ఐదు పెట్టెల్లోని నిధులు వెలికితీత
  3. నేటి నుంచి లెక్కించి భద్రపరుచనున్న జస్టిస్ బిశ్వనాథ్ కమిటీ
  4. పాములున్నాయనేది వదంతే!
  5.  నిధుల పెట్టెలను బయటకు తెచ్చిన అధికారులు
  6. నేటి నుంచి నిధి, దాని విలువ లెక్కింపు
  7. 1978 తర్వాత భండార్ తెరవడం ఇదే ప్రథమం
  8. భాండాగారం మరమ్మతులపై స్పష్టత కరువు

భువనేశ్వర్, జూలై 14: జగమేలే దేవదేవుడు శ్రీజగన్నాథుడి బొక్కసం తలుపులు ఎట్టకేలకు తెరుచుకొన్నాయి. ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలోని రత్నభండార్ తలుపులు అధికారులు ఆదివారం తెరిచారు. 46 ఏండ్ల తర్వాత తలుపులు తెరిచి అధికారులు లోపలికి వెళ్లారు. అందులో ఐదు చెక్కపెట్టెల్లో ఉన్న స్వామివారి ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలను లెక్కించే పని మొదలుపెట్టారు.

ఆదివారం నిధుల పెట్టెలను శుభ్రం చేసిన అధికారులు.. సమయం మించిపోవటంతో లెక్కింపును వాయిదా వేశారు. సోమవారం నుంచి ఒక్కో ఆభరణాన్ని లెక్కించి, దాని విలువను గణించి భద్రపర్చనున్నారు. రత్నభండార్‌లో పాములున్నాయని వచ్చిన వదంతులు ఉత్తవేనని తేలింది. తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన సమయంలో ఎలాంటి దుర్ఘటన చోటుచేసుకోలేదు. కానీ, బయటకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి భద్రతాధికారిగా వ్యవహరించిన ఓ పోలీస్ అధికారి అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చాయి.

భువనేశ్వర్, జూలై 14: ఒడిశాలోని పూరీ లో ఉన్న రత్నభండార్ తలుపులు దాదాపు 46 సంవత్సరాల తర్వాత తెరుచుకున్నాయి. పటిష్ట భద్రత మధ్య అధికారులు ఆదివారం భండార్ తలుపులు తెరిచారు. అందులోని 5 చెక్కపెట్టెలను బయటకు తీసుకొచ్చారు. ఒడిశా ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ ఆదివారం రత్నభాండాగారం తలుపులు తెరిచింది. అపారమైన నిధులు ఉన్న ఆ గదిలోకి ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని కమిటీ వెళ్లింది. ఈ కమిటీలో శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాదీ, ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ గడనాయక్ తదితరులు ఉన్నారు. 

మణులు, మణిహారాలు మరెన్నో.. 

12వ శతాబ్దంలో నిర్మించిన పూరీ ఆలయ రత్నభాండాగారంలో ఎన్నో మణులు, మాణిక్యాలు ఉన్నాయి. రత్నభాండాగారంలో రెండు గదులు ఉన్నాయి. బయటి గది, లోపలిగది అని భాండాగారం విభజించబడింది. 

కనిపించని నాగబంధం.. 

నిధి ఉన్న రత్నభాండాగారానికి రక్షణగా నాగబంధం ఉందని చాలా మంది నమ్మకం. దీంతో ఆదివారం తెరిచేందుకు వెళ్లిన కమిటీ సభ్యులు తమ వెంట పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకెళ్లారు. గతంలో తెరిచినపుడు అక్కడ పాము కనిపించిందని కూడా కొందరు చెబుతారు. కానీ ఆదివారం తెరిచినపుడు మాత్రం అటువంటిదేం కనిపించలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భాండాగారానికి నాగబంధం ఉందనే మాటలు ఉత్త పుకార్లే అని నిన్నటితో తేలిపోయింది. 

1978 తర్వాత ఇప్పుడే.. 

అప్పుడెప్పుడో 1978వ సంవత్సరంలో నిధి ఉన్న గది తలుపులు తెరిచి ఆ నిధిని లెక్కించారు. కానీ అందులో కొన్ని అనుమానాలు వ్యక్తం అవడంతో అసలు నిధి విలువ ఎంత అనే లెక్కలు సరిగ్గా తెలియలేదు. ఆ తర్వాత ఎన్నో సార్లు ఈ నిధి ఉన్న గది తెరిచేందుకు ప్రయత్నాలు చేసినా కానీ అవి ఫలించలేదు. రత్నభాండాగారం తలుపులను తెరిచి నా కానీ నిధిని లెక్కించేందుకు సమయం సరిపోకవపోవడంతో తర్వాత లెక్కిస్తామని కమిటీ స్పష్టం చేసింది. 1978లో ఈ భాండాగారంలోని నిధిని లెక్కించేందుకు దాదాపు 70 రోజుల సమయం పట్టింది. అన్ని రోజులు తీసుకున్నా కానీ నిధి ఎంత ఉందనే విషయంలో మాత్రం స్పష్టత కరువైంది. 

అధునాతన టెక్నాలజీతో.. 

ఈ నిధి ఉన్న గదికి నాగబంధం ఉందని చాలా మంది వాదించారు. దీంతో నిధిని తెరిచేందుకు వెళ్లిన కమిటీ.. తమ వెంట పాముల ను పట్టే వ్యక్తులను తీసుకెళ్లింది. అంతే కాకుం డా అక్కడ అనేక రకాల శక్తులున్నాయని కూడా పుకార్లు వచ్చాయి. దీంతో కమిటీ తమ వెంట కొంత మంది వైద్యులను కూడా తీసుకెళ్లింది. భాండాగారం తెరుస్తున్నపుడు అలా ఏం జరగలేదు. రత్నభండార్‌లో ఉన్న ఆభరణాలకు డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మాత్రమే కాకుండా అనేక రకాల సాంకేతికతలతో ముం దుకు వెళ్తారు. 

పూజలు చేసి మరీ..

రత్నభాండాగారాన్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత తిరిగి తెరుస్తుండటంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీచక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఈ పూజలు పూర్తున తర్వాత అధికారులు గదిని తెరిచారు. 

15 పెట్టెలు సిద్ధం

రత్నభాండాగారంలో సంపద అంతా పె ట్టెల్లో పెట్టి ఉంటుంది. ఆ పెట్టెలు సరిగ్గా లేకుంటే పెట్టెల్లో ఉన్న సంపదను మార్చేందుకు వీలుగా 15 పెట్టెలను అధికారులు సిద్ధ ం చేశారు. ప్రస్తుతం గదిలో ఉన్న పెట్టెలు ఒక వేళ పాడయినా అందులో ఉన్న సంపదను కొత్త పెట్టెల్లోకి మార్చి.. వాటిని అక్కడి నుంచి భద్రత నడుమ తరలించి.. పటిష్ట భ ద్రత నడుమ లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

లెక్కింపు వాయిదా.. 

రత్నభాండాగారం నుంచి బయటకు తెచ్చిన పెట్టెలలో ఉన్న సంపద లెక్కింపు వాయిదా పడింది. ఈ రోజు చీకటి పడడంతో రేపటి నుంచి లెక్కింపు ప్రక్రియ చేపడతామని అధికారులు ప్రకటించారు. చాలా రోజుల నుంచి అసంపూర్తిగా ఉంటున్న లెక్కింపు ప్రక్రియ ఈ సారైనా పూర్తవుతుందో లేదో అని అంతా ఎదురుచూస్తున్నారు. 

గదిలోకి వెళ్లిన అధికారికి అస్వస్థత 

రత్నభాండాగారాన్ని ఇలా తెరిచారో లేదో అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. రత్నభాండాగారం తెరిచిన కమిటీలో ఉన్న ఓ ఎస్పీ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. భాండాగార సమీపంలో పినాక్ మిశ్రా అనే ఎస్పీ సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది ఎస్పీని అక్కడే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.