calender_icon.png 15 October, 2024 | 4:55 AM

సంజీవన్‌రావ్ పేట్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం

15-10-2024 02:43:59 AM

గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే  సంజీవరెడ్డి 

 నారాయణఖేడ్, అక్టోబర్ 14: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని సంజీవన్‌రావ్ పేట్‌లో కలుషిత నీరు తాగి 50 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం కొనసాగుతోంది. సోమవారం గ్రామాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించి బాధితులను పరామర్శించారు.

తాగునీరు కలుషితం కావడంపై స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోగా, స్థానికంగా ఉన్న తాగునీటి బోర్లకు సంబంధించి మోటార్లు కాలిపోవడంతో పాడుపడిన బావి నుంచి నీటిని సరఫరా చేయడం వల్ల సమస్య తలెత్తిందని పలువురు గ్రామస్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, మిషన్ భగీరథ అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కారణంగానే ఇద్దరు చనిపోగా, మిగిలిన వారు అస్వస్థతకు గురయ్యారని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ఎమ్మెల్యేకు నిరసన సెగ

స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి గ్రామాన్ని సందర్శించి అదనపు కలెక్టర్‌తో చర్చిస్తున్న సమయంలో పలువురు గ్రామస్థులు ఎమ్మెల్యేకు తమ నిరనస తెలియజేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గ్రామంలోనే ప్రజలు రెండు వర్గాలుగా మారడంతో విషయం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

బాధితులను పరామర్శించిన ఎంపీ 

సంజీవన్‌రావ్ పేట్‌లో కలుషిత నీటి కారణంగా అస్వస్థతకు గురై నారాయణ ఖేడ్‌లోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌తో మాట్లాడి బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. 

సంజీవన్‌రావ్ పేట్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

ఇద్దరికి షోకాజ్ నోటీసులు

సంజీవన్‌రావ్ పేట ఘటనపై జిల్లా అధికారులు సోమవారం దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మీని సస్పెండ్ చేయడంతో పాటు ఎంపీవో ఇందిరమ్మ, గ్రామ ప్రత్యేక అధికారి కే వెంకట్‌రెడ్డికి కలెక్టర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు.

కాగా, మిషన్ భగీరథకు సంబంధించి వాటర్  గ్రీడ్ ఏఈ రవికుమార్, ఇంట్రా ఏఈ శ్రీకాంత్‌ను సై తం సస్పెండ్ చేస్తూ మిషన్ భగీరథ ఈ ఎన్సీ కృపాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సంబంధిత అధికారులు బావిలో నీటిని పరి శీలించకుండా, ఎలాంటి టెస్టులు చే యకుండా నేరుగా నీటి సరఫరాకు చ ర్యలు తీసుకోవడంతో పాటు విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్లు సమాచారం.