హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని హుస్సే న్ సాగర్ నిండుకుండలా మారింది. వివిధ ప్రాంతాల నుంచి సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బంజారాహిల్స్, పికెట్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో హుస్సేన్ సాగర్‌లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం ఉదయానికి నీటిమట్టం 513.72 మీటర్లకు చేరగా.. సాయంత్రానికి స్వల్పంగా తగ్గుముఖం పట్టిన ట్లు అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 2,811 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,255 క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, సాయంత్రానికి 513.67మీటర్లు ఉందని అధికా రులు తెలిపారు. తూముల ద్వారా నీటిని బయటకు వదులుతున్నారు.