02-03-2025 03:38:36 PM
దీనస్థితిలో ఉన్న మంగమ్మకు దిక్కెవరు?
ఐదుగురు సంతానం ఉన్న.. గ్రామ పంచాయతీలో సేద
గ్రామస్తులు అందించిన అన్నంతోనే కడుపు నింపుకుంటుంది
మునుగోడు,(విజయక్రాంతి): ఆకలితో అలమటిస్తూ తోడు గూడు ఎడబాసి గ్రామ పంచాయతీలోనే తలదాచుకుంటున్న వృద్ధురాలి సంఘటన మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. దీని స్థితిలో ఉండి ఆకలితో అలమటిస్తున్న మంగమ్మకు దిక్కెవరన విషయంలో గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.గ్రామస్తులు వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన నారగోని మంగమ్మ భర్త మల్లయ్య అనే వృద్ధురాలు ఐదుగురు మంది సంతానం (నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు)కలిగి ఉండి కూడా గ్రామపంచాయతీలో కాలం గడుపుతూ గ్రామస్తులు అందించే అన్నంతో కొన్ని రోజులుగా కాలం గడుపుతున్నది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం మంగమ్మ కి ఈ దుస్థితి ఏర్పడిందని, ఆరోగ్యం బాగోలేక ఆకలితో అలమటిస్తూ గ్రామస్తులతో తన గోడును వెల్లబోసుకున్నట్లు సమాచారం. మండల స్థాయి ,గ్రామస్థాయి అధికారులు మంగమ్మ విషయంలో తక్షణమే చొరవ తీసుకొని ఆమెకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలుపుతున్నారు.