calender_icon.png 7 November, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురులేని సింగపూర్ పాస్‌పోర్ట్

25-07-2024 01:33:24 AM

  1. వరుసగా రెండో ఏడాది కూడా శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా రికార్డు
  2. శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా విడుదల
  3. నిరుటితో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగు

న్యూఢిల్లీ, జూలై 24: వరుసగా రెండోఏడాది కూడా సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రప ంచంలోని శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకున్నా సరే 195 దేశాలకు వీసా లేకుండా ప్రయాణి ంచవచ్చు. రెండో స్థానంలో ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, జపాన్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్’ విడుదల చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ఈ జాబితాలో ఇండియా 82వ స్థానంలో నిలిచింది.

గతేడాది 85వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్ ఈ సారి మాత్రం 82వ ర్యా ంకును సొంతం చేసుకుంది. ఇండియా పాస్‌పోర్ట్‌తో 58 దేశాలకు వీసా లేకుండా ప్రయా ణించవచ్చు. ఇండియా సెనెగల్, తజకిస్తాన్ వంటి దేశాలతో 82వ ర్యాంకును పంచుకుం ది. పాక్ పాస్‌పోర్ట్ ఈ జాబితాలో వందో స్థానం దక్కించుకుంది. చివరి స్థానంలో అఫ్ఘనిస్తాన్ నిలిచింది. అఫ్ఘన్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకుండా 26 దేశాలకు వెళ్లొచ్చు. 

వీసా రహితమే ప్రామాణికం.. 

ఈ జాబితాను రూపొందించేందుకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ దగ్గరున్న ప్రయాణికుల సమచారం, ఒక దేశ పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలకు వీసారహితంగా వెళ్లొచ్చనే దాని మీద ఆధారపడుతుంది.