కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఇనుప సామాను దుకాణం దగ్ధమైన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన అశోక్ ఇనుప సామాను దుకాణం నడిపిస్తున్నాడు. దుకాణానికి బుధవారం రాత్రి తాళం వేసి బయటకు వెళ్ళగా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. సుమారు 5 లక్షల విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.