calender_icon.png 30 October, 2024 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారాపై ఉక్కుపాదం మోపాలి

14-08-2024 02:25:56 AM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి

హనుమకొండ, ఆగస్టు 13 (విజయక్రాంతి): నాటుసారాపై ఉక్కుపాదం మోపి, ఈ నెల ఆఖరు నాటికి ఉమ్మడి వరంగల్‌ను నాటుసారా రహిత జిల్లాగా మార్చాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఎక్సైజ్ అధికారును ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, ఆలం సరఫరాపై నిఘా పెట్టాలని, సరఫరా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదే శించారు. సమావేశంలో వరంగల్ సీపీ అం బర్ కిషోర్ ఝా, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్‌రావు పాల్గొన్నారు.