28-03-2025 01:43:24 AM
మరిపెడ పాస్టర్స్ ఆధ్వర్యంలో నిరసన
మహబూబాబాద్ .మార్చి 27: విజయ క్రాంతి )దైవ సేవకులు క్రైస్తవ లోకానికి ఎనలేని సేవ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన ప్రముఖ క్రైస్తవ పెద్దలు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటనీ,ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని క్రైస్తవ మత పెద్దలు ఉప్పల జాషువా వెంకటేశ్వర్లు కోరారు.
గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో మరిపెడ మండలం పరిధిలోని పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిసి ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై పాస్టర్ ప్రవీణ్ కు నివాళులర్పించి,ఆయన మృతి మిస్టరీ పై విచారణ చేయాలని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి సాధారణ ప్రమాదం లా కనిపించడం లేదని, హెల్మెట్ ధరించిన మృతి చెందడం నమ్మశక్యంగా లేదని,కావాలనే కొందరు దాడి చేసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి లౌకిక దేశంగా చాటి చెప్పాలన్నారు.
లేని పక్షంలో దీనిని ప్రభుత్వ హత్యగా భావిస్తామని అన్నారు.ఈ నిరసనలో మండల ప్రెసిడెంట్ ఎస్ దావీదు,వైస్ ప్రెసిడెంట్ ఐ దేవరాజు,జనరల్ సెక్రెటరీ దేవ సహాయం,జాయింట్ సెక్రెటరీ కె ఉపేంద్ర పాల్, ట్రెజరర్ డి రాజేష్, సలహాదారులు ఈ భాస్కర్,సిహెచ్ రామాచారి, ఉప్పల జాషువా,పాష్టర్ ఆర్ మహేందర్,మిఖాయేల్,ఎస్ మత్తయ్య,ఎల్ సామ్యూల్,జె మోహన్,సిహెచ్ స్వర్ణక్క,కే జీవన్,పాస్టర్ ఇస్సాకు పాల్గొన్నారు.