calender_icon.png 3 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి

27-03-2025 12:37:31 AM

ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో క్రైస్తవ సంఘాల నిరసన 

ఎల్బీనగర్, మార్చి 26 : ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని రాజమండ్రి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. క్రైస్తవ సంఘాల నాయకుడు అర్చ్ బిషప్ దయానంద్ మాట్లాడుతూ...ప్రవీణ్ కుమార్ మృతి పట్ల క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులకు అనే అనుమానాలు ఉన్నాయన్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపిం చాలని కోరారు. బుధవారం సాయంత్రం ప్రవీణ్ కుమార్ మృతదేహం హైదరాబాద్ కు వస్తుందని తెలిపారు. ప్రవీణ్ కుటుంబానికి ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరారు.