calender_icon.png 29 March, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరంతస్తుల భవనం కూలిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి..

26-03-2025 08:04:54 PM

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్నంలో ఆరు అంతస్తుల భవనం కూలిపోయిన దాని గురించి సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ ను కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి తక్షణమే కూలిపోయిన భవనంలో ఇరుక్కుపోయిన కార్మికులను రక్షించాలని కలెక్టర్ ను ఆదేశించారు. పోలీస్ రెస్క్యూటివ్ ఫైర్ అధికారులు అందరూ అక్కడే ఉండి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు.