calender_icon.png 25 April, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెండర్ల అవకతవకలపై విచారణ జరిపించాలి

25-04-2025 12:11:25 AM

సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చామకూర రాజు

ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఎల్‌ఈడీ అడ్వర్టైజ్మెంట్ బోర్డుల అలాట్మెంట్ టెండర్లలో అవకతవకలపై విచారణ జరిపించాలని సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చామకూర రాజు డిమాండ్ చేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి 100 కోట్లు నష్టం జరుగుతుంద న్నారు.

గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడుతూ కోర్టు వివాదాల్లో ఉన్న నవనిర్మాణ్ అసోసియేట్స్ సంస్థకు టెండర్ అలాట్ చేశారని తెలిపారు. టెండర్ ప్రక్రియలో జతపరచిన డాక్యుమెంట్లలో అనేక అంశాలపై సదరు సంస్థ తప్పు దారి పట్టించిందని ఆరోపించారు. రూ.10, 12 కోట్లు కోట్ పేర్కొన్న సంస్థను కాదని రూ.63, రూ.56 లక్షలు కోట్ చేసిన సంస్థల అర్హత గలయిగా ప్రకటించారని తెలిపారు.

కాబట్టి ప్రస్తుత టెండర్ లను రద్దు చేసి తిరిగి పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవకతవకలపై హైకోర్టులో కేసు కూడా నడుస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రతినిధి వేములకొండల్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కెవి గౌడ్, ఉపాధ్యక్షులు చెన్నా శ్రీకాంత్, సోని గౌలికార్ తదితరులు పాల్గొన్నారు.