బషీర్‌బాగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కాలేజ్ ఎదుట విద్యార్థుల నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ 4వ సంవత్సరం చదువు తున్న శ్రావ్య మృతిపై సమగ్ర విచారణ జరిపి, పోస్టుమార్టం రిపోర్టును బహిరంగపరచాలని పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా బషీర్‌బాగ్ ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గురువారం బషీర్‌బాగ్ కళశాల వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
శ్రావ్య మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. కన్సల్టెన్సీకి సంబంధించిన ఆఫీస్ యాజమాన్యం ఘటన సమయంలో అక్కడ లేకపోవడం, ఇప్పటివరకు ఆ కన్సల్టెన్సీ నుంచి సరైన సమాధానం రాకపో వడం, అక్కడ సీసీటీవీ ఫుటేజీని మీడియాకి రిలీజ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. విచారణలో పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.