calender_icon.png 26 October, 2024 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా

10-08-2024 12:36:09 AM

  1. ఒకరి అరెస్టు 
  2. 1832 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం 
  3. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ డివిజన్ పోలీసులు బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు. శుక్రవారం ముఠాలోని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నేరడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సుధీర్‌బాబు మీడి యా సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. ముంబైలో బంగారు నగల టోకు వ్యాపారం చేసే ఏడీ జ్యూయలరీస్ వివిధ రాష్ట్రాల్లోని తమ నగల దుకాణాలకు బంగా రు ఆభరణాలను తమ సంస్థ ఉద్యోగుల ద్వారా బస్సుల్లో సరఫరా చేస్తుంటారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముగ్గురు దొంగల ముఠా ఓ పథకం ప్రకారం బంగారు నగలను ఎప్పుడు, ఏ బస్సుల్లో తీసుకెళ్తున్నారో పసిగట్టి, వారిని వెంబడించి చాక చక్యంగా చోరీలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఏడీ జ్యూయలరీస్‌కు చెందిన ఉద్యోగి పురోహిత్ భరత్‌కుమార్ గత నెల 26న 1832 గ్రాముల బరువు గల 52 బం గారు ఆభరణాలను ఏపీలోని తమ జ్యూయలరీస్ దుకాణంలో అందజేయడానికి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఎక్కాడు. అయితే, ఈ బస్సును హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెం వద్ద గల తాజ్ కిచెన్స్ వద్ద అల్పాహారం కోసం నిలపగా, భరత్‌కుమార్ టీ తాగడానికి కిందకు దిగా డు. తిరిగి బస్సు ఎక్కి చూడగా నగల బ్యాగు కనిపించలేదు. దీంతో 28న ఏడీ జ్యూయలరీస్ సేల్స్ మేనేజర్ కునాల్ కొఠారి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఆద్యా హోటల్ వద్ద నిఘా వేసిన రాచకొండ పోలీసుల బృందం ముఠాలోని సభ్యుడు సోనీ ఠాకూర్(22)ను పట్టుకున్నారు. అతడి నుంచి 52 బంగారు ఆభర ణాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ఇద్దరి ఆచూకీ కూడా కనుగొ న్నారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని కమిషనర్ తెలిపారు.