మన కులాలు
మన రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కావాలంటే ఒక సమీకృతమైన మత్స్య విధానం రాష్ట్రానికి ఉండాలి. దేశంలోని అనేక ప్రాంతాల్లో లే ని విధంగా తెలంగాణకు నీటి వనరులను పుష్కలంగా కలిగిన రాష్ట్రంగా మంచి పేరుంది. ఈ రాష్ట్రం నుండి గోదావరి, కృష్ణ, తుంగభద్ర లాంటి నదులు, శబరి, ప్రాణహిత వంటి ఉపనదులు ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో గొలుసుకట్టు పద్ధతిలో 46,000కు పైబడి చెరువులతో, రాజుల కాలం నుండి నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి ఇటీవలి ఎత్తిపోతల పథకాల వరకు నీటి వనరులు సమర్థవంతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ జలాశయాల పరిధిలో మత్స్య పరిశ్రమ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు ఏర్పడ్డాయి. దేశం లోని మంచినీటి జలాశయాలు కలిగిన రాష్ట్రాలకంటే ఎక్కువగా మత్స్యకారు లు, మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలోని చేపల పెంపకంపై దృష్టి సారించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సహజ నీటి వనరులు కలిగిన ప్రాంతాలు చేపల పెంపకానికి అనువుగా ఉన్నాయి. నదులు, రిజర్వాయర్లు, చెరువు లు, కుంటలతో దాదాపు 4 లక్షల 15 వేల హెక్టార్లకు విస్తరించిన ప్రదేశాలు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, శబరి లాంటి నదుల కింద విస్తరించి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 19,476 గ్రామ పంచాయితీ చెరువులు, కుంటలు, 4,324 డిపార్టుమెం ట్ చెరువులు, 74 రిజర్వాయర్లు కలిసి మొత్తంగా 41 లక్షల 17 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చేపలు పెంచడానికి అనువుగా ఉన్నది. ప్రైవేటు రంగంలో 474 ఆక్వాకల్చర్ పాండ్స్ 781 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో 3,497 మత్స్య సహకార సంఘాలు, 416 మహిళా మత్స్య సహకార సంఘాలతో దాదాపు 3 లక్షల 25 వేలకు పైగా మత్స్యకారులు ఈ వ్యవస్థపై ఆధారపడి జీవితాలను వెళ్ళదీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇన్‌లాండ్ నీటి వనరులతో దేశంలో 3వ స్థానంలో ఉండగా, మ త్స్య ఉత్పత్తిలో 6వ స్థానంలో ఉంది. అపారమైన జల సంపద ఉన్న ఈ రాష్ట్రంలో సమీకృతమైన మత్స్య విధానం రూపొందించడం ద్వారా దీనిపై ఆధారపడ్డ 40 లక్షల మంది జీవన ప్రమాణాలు మెరుగు పడడమేకాక రాష్ట్ర నీటి వనరులు సమర్థవంతంగా వినియోగించుకొన్న వాళ్లమవు తాం. ఈ రకంగా దేశంలోని ఎన్నో రకాల చేపల పంపకాన్ని శాస్త్రీయ పద్ధతిలో అనుసంధానించి జాతీయస్థాయిలోనే మత్స్య ఉత్పత్తిని అధికంగా సాధించే రాష్ట్రాలలో అగ్రగామిగా నిలబడవచ్చు.
చేపల ఆహారం మనకు ఎంతో అవసరం కాగా, ఈనా డు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలు దాదాపు 50% ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగడానికి, సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి దేశంలోని మత్స్య పరిశ్రమలో, ఆక్వాకల్చర్‌ను ఉన్నత స్థాయికి చేర్చడానికి ఒక సమీకృతమైన మత్స్య అభివృద్ధి విధానాన్ని ఆదరించవలసిన సమయమిది.
నూతన మత్స్య విధానంలో పొందు పరచవలసిన అంశాలు
- మత్స్య వనరులుగల ప్రాంతాలను రా ష్ట్రంలో గుర్తించడం. అందులో ఎక్కువ సంఖ్యలో చేపలు లభ్యమయ్యే ప్రదేశాలు, అత్యధిక విలువగల చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించడం.
- మత్స్య సంపదను అభివృద్ధి చేయుటంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచడం.
- ఇప్పటి వరకు గుర్తింపబడని మత్స్య ప రిశ్రమకు అనువైన ప్రాంతాలను గుర్తిం చి ఆక్వాకల్చర్‌లో వాటిని వినియోగంలోకి తేవడం.
- నాణ్యమైన చేపపిల్లల అభివద్ధికి కృషి చేయడం.
- చేపపిల్లల ఉత్పత్తిలో, చేపల పెంపకంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక ఉత్పాదకతను సాధించడం.
- గ్రామీణ మార్కెట్లలో నిరంతరం చేపలు దొరికే విధంగా సౌకర్యాలు కల్పిస్తూ డిమాండ్, సప్లై అంతరం లేకుండా చూడటం.
- ఎక్కువ మార్కెటు నిలువ కలిగిన చేపల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చి చేపల ఎగుమతికి ఉన్న అవకాశాలన్నీ సద్వినియో గం చేసుకోవడం.
- చేపల మార్కెట్‌కు తరలించే తరుణంలో మార్కెట్లలో శుచి శుభ్రతతోకూడిన వాతావరణాన్ని కలుగజేయడం.
- మత్స్యకారులకు కేటాయించిన వనరులపై వారికి పూర్తిస్థాయి అధికారం, సాధికారత ఉండేలా విధాన రూపకల్పన చేయడం.
- మత్స్య మార్కెటింగ్ వ్యవస్థకు ఉపయోగపడే రవాణా సౌకర్యం (రిఫ్రిజిరే టర్) వాహనాలు, బతికిన చేపలను తరలించే వాహన సౌకర్యం, ఐస్ ఫ్యాకరీల నిర్మాణం, రిటైల్ అమ్మకం దారుల కు (రిఫ్రిజర్) ఐస్ బాక్సులు అవసరమైన సాంకేతిక విషయ పరిజ్ఞానం, సమాచార వ్యవస్థను రూపొందించాలి.
- ఆక్వాకల్చర్‌లో పబ్లిక్ ప్రైవేట్ భాగసామ్యంలో పెట్టుబడులను ప్రోత్సహిం చే విధానాలు రూపొందించడం.
- మానవ వనరులు, అభివృద్ధి సాంకేతిక పరమైన అంశాలలో పరిజ్ఞానం, మత్స్య పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థల నిర్మాణం, మత్స్య పెంపకంపై వస్తున్న అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం, పరిశోధన, అభివృద్ధి అంశాలపై మత్స్యకారులను ఆక్వాకల్చర్‌లోని మిగతా భాగస్వాములను ఎప్పటికప్పుడు చైతన్య పరిచే వ్యవస్థ ఉండాలి.
- మత్స్య పరిశ్రమలో అదనపు, అనుబం ధ ఉపాధి అవకాశాలను మెరుగు పరి చే విధానం అందుబాటులోకి రావాలి.
ఆక్వాకల్చర్ సీడ్ ఉత్పత్తి
- క్యాపిటీవ్ నర్సరీని పెద్ద జిల్లాల్లో, చెరువుల్లో ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద సైజులో చేపపిల్లల సీడ్‌ని ఉత్పత్తి చేయవచ్చు.
- అదే విధంగా పెద్ద చెరువుల్లో మరీ 100 ఎకరాలపై ఉన్న చెరువు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) కన్న పైన చెరువు షికారులో MGNREGS పథకం కింద చేపల పెంపక చెరువు తవ్వుకొనే అవకాశం ఉంది. ఒక ట్యాంక్ విస్తీర్ణం 15 మీ. పొడువు 25 మీ. వెడల్పుతో 4 ఫీట్ల లోతులో ట్యాంక్‌లు అభివృద్ధి చేయవచ్చు. ఒక్కొక్క చెరువులో 4 పైగా ఇటువంటి ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టి మొదట సీడ్ ఉత్పత్తి కేంద్రాలుగా వినియోగించుకోవచ్చు. అందుకు నీటి వనరులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. దానికి ఒక బోరు మోటారు ప్రభుత్వ సహకారంతో కల్పించవచ్చు.
- తెలంగాణ ప్రాంతంలోని వాటర్ లాగ్‌డ్ (నీరు నిల్చే) ప్రదేశాలను గుర్తించి మత్స్య రైతులకు 10 సం॥లకు ఆమోదయోగ్యమైన ధరలపై లీజుకు ఇచ్చి సీడ్ పెంపకాన్ని ప్రోత్సహించాలి. అందుకు NFDB ద్వారా ఉన్న పథకాలను అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ సైతం జోడించి వాటిని సీడ్ ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయా లి. అలాగే, కాల్వల సమాంతరంగా ఉన్న నీటి లాగిన్ ప్రాంతాల్లో, నీటి పా రుదల ప్రాజెక్ట్ ఆధీనంలో ఉన్న ఇతరుల స్థలాలు, సీడ్ పొలాలు లీజుకు ఇ వ్వడంతోపాటు ఫిషింగ్ సెంటర్‌లుగా అభివృద్ధి చేయడానికి వసతులు, వనరులు కల్పించాలి.
- చేపల పెంపక కేంద్రాలను వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి కేంద్రాలుగా గుర్తిం చి వ్యవసాయానికి ఇస్తున్నట్టుగానే చేప ల పెంపకానికి కూడా ఆర్థిక సంస్థలతో రుణాలు, విద్యుత్ పంపిణీ, వాటర్ సిస్‌లో రాయితీలు, సీడ్ సప్లయిలో రాయితీలు అందచేయాలి.
- మంచి ఆరోగ్యవంతమైన చేప విత్తనం అధిక సంఖ్యలో చేపల ఉత్పత్తికి దోహ దం చేస్తుంది. కాబట్టి, సీడ్ కేంద్రాల అ భివృద్ధి, నాణ్యమైన సీడ్ పెరుగుదలకు అన్ని రకాల ప్రోత్సాహం కల్పించాలి. వి విధ గ్రామాల పరిధిలో మత్స్య సహకా ర సంఘాల పరిధిలో ఉన్న ట్యాంక్‌లలో ఇటీవలి కాలంలో కొన్ని ట్యాం క్స్/పాండ్స్ వ్యవసాయానికి వినియో గం కాకుండా ఉన్నవాటిని గుర్తించి వా టిని స్థానిక మత్స్య సహకార సంఘాల పరిధిలో సీడ్ ఫండ్స్ అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలి. వాటిని అభి వృద్ధి చేయడంలో ఎన్‌ఎఫ్‌డీబీ, ప్రభు త్వం ప్రోత్సహకాలు కల్పించాలి. కేజ్ క ల్చర్, పెన్ కల్చర్ సైతం సీడ్ పెంపొందిస్తున్న కేరళ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల అ నుభవాలను పరిగణనలోకి తీసుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిశోధన కేంద్రాల సహకారంతో ఈ సంవత్సరం నుండి రివర్/ ప్రాజెక్ట్ బేస్ లో కేజ్ కల్చర్‌ను ఏర్పాటు చేయాలి.
(తరువాయి వచ్చేవారం)
పల్లెబోయిన అశోక్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ముదిరాజ్ మహాసభ