calender_icon.png 27 December, 2024 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే విచారణ

29-10-2024 01:41:35 AM

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

ఆదిలాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణనపై రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల సభ్యులు, ప్రజ ల అభిప్రాయాలు తెలుసుకునేందుకే విచారణ చేపడుతున్నామని, తద్వారా అందిన సూ చనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు.

ఆదిలాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన కులగణనపై బీసీ కమిషన్ నిర్వహించిన విచారణలో ఆయన మాట్లాడారు. ముందుగా ఏజెన్సీలో వంద శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో వెనుకబడిన తరగతుల వారు నష్టపోతున్నారని, వాటిని తొలగించాలని పలువురు వినతి పత్రాలు అందించారు.

జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కేటగిరీకి కూడా అవకాశం కల్పించాలని పలు వురు కోరారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మ న్ నిరంజన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

ఉమ్మడి పది జిల్లాల్లో నవంబర్ 13వ తేదీ వరకు పర్యటించి బహిరంగ విచారణ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. డిసెంబన్ 9న సేకరించిన సమా చారాన్ని ప్రభుత్వం ద్వారా హై కోర్టుకు అందజేస్తామన్నారు. విచారణలో ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.