calender_icon.png 24 October, 2024 | 11:50 AM

బ్యాంకు ఆడిటర్ల పాత్రపై విచారణ

24-10-2024 01:38:05 AM

  1. బ్యాంక్ కుంభకోణంపై కొనసాగుతున్న దర్యాప్తు 
  2. షేర్ క్యాపిటల్ స్వాహాపై ఇంటలిజెన్స్ ఆరా 

ఖమ్మం, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ డీసీసీబీ బ్యాంక్‌లో నకిలీ ధ్రువపత్రాలతో దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంపై విచారణ ముమ్మరం గా సాగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన బ్యాంక్ మేనేజర్ పాత్ర, ఆయనకు సహకరించిన వారి  పాత్ర, ఆడిటర్ల నివేదిక, షేర్ క్యాపి టల్‌లో డబ్బు తదితర అంశాలపై విచారణ జరపుతున్నట్టు సమాచారం.

రుణాలు పొం దిన వారికి సంబంధించిన షేర్ క్యాపిటల్ డబ్బు కూడా స్వాహా అయినట్టు ఆరోపణలున్నాయి. వాటిపైనా అధికారులు ఆరా తీ స్తున్నారు. రుణాలు పొందిన వారి వివరాలు సేకరించి వివరాలు రాబడుతున్నారు. అంతేకాకుండా ఇంటటెలిజెన్స్ వర్గాలు సైతం స్కాంపై దృష్టి సారించినట్టు తెలిసింది.

ఇంటలిజెన్స్ అధికారులు బ్యాంక్‌కు వెళ్లి వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదించినట్టు సమాచారం. ఈ బ్యాంక్‌లో గతంలో పని చేసిన మేనేజర్ హయాంలో ఇచ్చిన రుణా లు, షేర్ క్యాపిటల్, తదితర అంశాలపై సమ గ్ర దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలను రాష్ట్ర కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీకి కూడా నివేదించారు.

త్వరలో ఒక ఉన్నత స్థ్ధాయి విచారణ బృందం బ్యాంక్‌కు వస్తుందని అంటున్నారు. ఆడిటర్ల విచారణ సంద ర్భంగా నకిలీ రుణాల వ్యవహారం ఎందుకు బయటపడలేదనే ప్ర శ్నలు రేకెత్తుతున్నాయి. లోతుగా విచారిస్తే  వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు కోరుతున్నారు.