ఆదిలాబాద్ (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లయి హమాలీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్ లోని సివిల్ సప్లై గోదాము ఎదుట చేపట్టిన సమ్మె శుక్రవారంకు 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొని కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ... గతంలో సివిల్ సప్లయి కమిషనర్ కార్మికులతో ఒప్పుకున్న ప్రకారం జీ.వో అమలు చేయక పోవడం శోచనీయం అన్నారు. పెరిగిన రెట్ల జీ.వో అమలు చేయకపోవడం వెనుక ఉన్న మతాలబు కార్మికులకు అర్థం కావడం లేదన్నరు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలతో సహా ఒప్పంద జి.ఓ ను అమలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్మికులకు 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించకాపోతే సమ్మె ను ఉదృతం చేస్తన్నారు.