calender_icon.png 28 January, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ విజయం

26-01-2025 11:37:30 PM

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 43 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (177) భారీ సెంచరీతో మెరిశాడు. 9 వికెట్లతో హిమాచల్ నడ్డి విరిచిన అనికేత్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 439 పరుగులతో, మేఘాలయపై ఒడిశా ఇన్నింగ్స్ 56 పరుగులతో, బీహార్‌పై యూపీ ఇన్నింగ్స్ 119 పరుగులతో, చత్తీస్‌గఢ్‌పై జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో, చంఢీగర్‌పై తమిళనాడు 209 పరుగుల తేడాతో, రాజస్థాన్‌పై విదర్భ 221 పరుగుల తేడాతో విజయాలు నమోదు చేసుకున్నాయి. సర్వీసెస్ x త్రిపుర, రైల్వేస్ x అస్సాం, ఎంపీ x కేరళ, ఆంధ్ర x పాండిచ్చేరి మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తర్వాతి రౌండ్ మ్యాచ్‌లు జనవరి 30 నుంచి జరగనున్నాయి.