calender_icon.png 10 January, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీతాత చెట్టుతో అనిర్వచనీయ అనుభూతి

10-01-2025 12:02:31 AM

దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు.

గాంధీ అనే పాత్రలో సుకృతి వేణి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం దక్కించుకుంది. ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను స్టార్ హీరో మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకురాలు పద్మావతి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో ద్వేషాలు, అసూయతో కూడిన ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గాంధీ సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు’ అన్నారు.