calender_icon.png 5 March, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న వీడ్కోలు వేడుక

03-03-2025 12:00:00 AM

కరీంనగర్, మార్చి 2 (విజయక్రాంతి) : నగరంలోని రేకుర్తిలో గల స్వాగత్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఫన్క్రోలిక్ పేరుతో నిర్వహించిన అల్ఫోర్స్ జెన్ నెక్స్ట్ పాఠశాల పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ఆకట్టుకుంది. అతిధిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై సరస్వతిమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, లక్ష్యాలు సాధించే విధంగా శ్రమించాలని చెప్పారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులను సాధించి విద్యార్థి జీవితంలో పొందేటువంటి మొట్టమొదటి పట్టాను చాలా ప్రశంసనీయంగా చేసుకోవాలని సూచించారు.

అనంతరం విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.