calender_icon.png 21 April, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మాచార్యుడు

15-03-2025 12:00:00 AM

ఆయన తలపాగ ధరించిన ఆచార్యుడు. దేశీయ వస్త్రధారణ అంటే ఆయన కెంతో ఇష్టం. వైదేశిక భావజాలం పట్ల పూ ర్తి అయిష్టత. మన జానపద సాహిత్యంలో పరిశోధన చేసినప్పటికీ ఆయనది కచ్చితంగా జ్ఞానపథం. ఇంతకు ఆయన ఎవరో కాదు, ఆచార్య యెల్దండ రఘుమారెడ్డి. ఆయన అసామాన్యుడు, సనాతన ధర్మావలంబకుడు. వేషభాషలలోనేకాక వైదిక సం స్కృతినే తన వ్యక్తిత్వంగా మార్చుకున్న ఆచార్యవర్యులు. ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేసిన రఘుమన్న ఏకంగా ఉ స్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. వేలాది మంది విద్యార్థులకు ఉపదేశికులయ్యారు. సనాతన ధర్మానికి పూర్తిగా అంకితమైన రఘుమన్న కవిశాసన బిరుదాంకితులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘సారస్వత అశ్వమేధాన్ని’ నిర్వహించారు. 

వంద ప్రశ్నలను సంధించి, వాటికి సరైన సమాధానాలు చెప్పిన వారికి “లక్ష రూపాయల బహుమతి ఇస్తానని” ప్రకటంచారు. “కాదను వాడెవడున్నా కదనా నికి రమ్మని” ఎలుగెత్తి చాటిన సారస్వత వీరుడు. ఆయన కేవలం ఉద్యోగి మాత్రమే కాదు, యోగి సమానులు. అన్నమాటను నిలబెట్టుకున్న మహానుభావుడు మన రఘుమన్న.తనతో నాకు ఇరవై ఏండ్ల అనుబంధం. 

మొదట నేను వారితో కలిసి ఎనిమిదేళ్లు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో పని చేశాను. అందరితో కలిసిపోయే స్వభావమేగాక ఎవరితో కలహించుకోవడం వారి కి తెలియదు. ఐతే, ధర్మ వ్యతిరేకులను మా త్రం విడిచేవారు కారు. అప్పుడు సౌందరరాజన్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. తెలుగుశాఖలో నాతోపాటు ముదిగొండ శివప్రసాద్, కె.రాజన్న శాస్త్రి ఉన్నారు. రఘుమన్నతోపాటు మేం ముగ్గురం వి ద్యార్థులను తీర్చిదిద్దే పనిలో కృతకృత్యులమయ్యాం. రఘుమన్న, శివప్రసాద్, రాజ న్న శాస్త్రి ఈ ముగ్గురు గొప్ప సౌజన్యమూర్తులు. కొత్తగా లెక్చరర్‌గా చేరిన నాకు వా రు మార్గదర్శకులయ్యారు.

కులపట్టింపు లేని ఆదర్శవాది

రఘుమన్న ‘ముత్తి పదాలు’ రాశారు. నేను వాటిని దృష్టిలో పెట్టుకొని ‘మల్లి ప దాలు’ రాశాను. వారి ప్రభావం వల్లనే నే ను దయానంద మహర్షి ఆర్యసమాజ ప్ర భావానికి లోనయ్యాను. విద్యార్థులపైనే కాక తోటి అధ్యాపకులమీద ప్రభావాన్ని చూపే మహావ్యక్తి రఘుమన్న. ఆయన చొరవవల్లే నేను శతాధిక వృద్ధులైన పండి త గోపదేవులకు శిష్యుడినయ్యాను. ఏడా ది కాలం దర్శనగ్రంథాలను పఠించాను. ఆ ర్యసమాజ భావాలను అలవర్చుకున్న ర ఘుమన్న కులాన్ని ఎన్నడూ పట్టించుకోలే దు. ధర్మప్రియులంతా వారికి స్నేహితు లే.

వారు తమ పిల్లలను గురుకులాలలో చదివించి పెద్దవారిని చేసి, వారి వివాహాలను కూడా ఆర్యసమాజ పద్ధతిలోనే జరిపారు. పీజీ కళాశాల తెలుగు విద్యార్థులను నేను ఢిల్లీ విహార యాత్రకు తీసుకెళ్లినప్పుడు, మాకు ఆయనే అక్కడ ఉండటానికి ఏర్పా టు చేశారు. వారికి తెలియని గురుకులాలు లేవు. పదిహేను మంది విద్యార్థులతో మే మంతా శక్తినగర్(ఢిల్లీ)లోని ఆర్యసమాజ మందిరంలో హాయిగా ఉన్నామంటే అం దుకు వారి సిఫారసే కారణం. రఘుమన్న వారిది గురుకుల పద్ధతి. వారెక్కడికి వెళ్లినా సనాతన ధర్మాన్ని బోధించారు. ఆయన ఆధ్వర్యంలో ఆచార్య కసిరెడ్డి సంయోజకత్వంలో నేను, నామిత్రులం ఒక పదిమం దిమి ‘సంచార సాహిత్య యాత్ర’ నిర్వహిం చాం. రాత్రి సభలను ఏర్పాటు చేసి తెల్లవా రే దాకా ఆయా గ్రామాల్లో ప్రజలను సా హిత్యం, ధర్మం పట్ల శ్రద్ధ కలిగిన వారిగా తయారుచేశాం. అనేక కవి సమ్మేళనాలనూ నిర్వహించాం.

“ఎల్లవేళలా ఏదో ఒకటి చేయాలి. అప్పుడే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది” అన్నది ఆచార్య యెల్దండ ఆశయం. ‘వైదిక సాహిత్యంలో స్త్రీ’ అనే ఆయన గ్రంథం భారతీయ మహిళ గొప్పతనాన్ని చాటింది. తన గ్రంథాలన్నీ వైదిక వాఙ్మయ స్పర్శ కలిగినవే. ఉస్మానియ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాలలో వారికి ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశారు. పాదరక్షలు తొడుక్కుని ఆయన ఎన్నడూ క్లాసు రూమ్‌లోకి ప్రవేశించలేదు. ఎవరో ఒకరు వారి పాదరక్షలను అధ్యక్షస్థానంలో పెట్టి అగౌర పరిస్తే ఊరుకోలేదు కూడా. ఆ వ్యక్తిని శిక్షించేవారు. సమాజంలో ‘శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ’ ఉన్నప్పుడే ధర్మం వర్ధిల్లుతుందని ఆయన అనేవారు.

వేదానుకూల సిద్ధాంతవాది

రఘుమారెడ్డి సిద్ధాంతం వేదానుకూలమైంది. దేవుణ్ణి మాయ ఆవరిస్తుందంటే ఆయన నమ్మలేదు. దేవుడే జీవుడవుతాడన్న దానినీ ఒప్పుకోలేదు. అవతార వా దాన్ని ఆయన నిర్దందంగా ఖండించారు. విగ్రహారాధన, అవతార వాదం, అస్పృశ్యత వేదంలో ఎక్కడ ఉన్నాయో చూపెట్ట మని రఘుమన్న సవాలు విసిరారు. మ హర్షి దయానందుల బాటలో జీవితాం తం నడిచారు. గండిపేటలో అగ్నిగురు కులాన్ని స్థాపించి, తన అల్లుడినే ఆచార్యునిగా నియమించారు. అక్కడ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. ఉద్యోగ విరమణానంతరం వ్యవసాయాన్ని కొనసాగిం చారు. రిటైర్మెంట్ సందర్భంలో ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యులను, విద్యార్థులను, నాల్గ వ తరగతి ఉద్యోగులను అందరినీ ఆహ్వానించి, అందరితోపాటు కూర్చొని భోజనం చేశారు. అప్పుడు వర్సిటీ సిబ్బందికి వస్త్రదానం చేశారు. ఈ ఆదర్శాన్ని నేనూ పాటించాను.

మా వూరికి యెల్దండ 12 మైళ్ల దూరం. ఐదు తర్వాత 6వ తరగతికి నాతోటి విద్యార్థులంతా అక్కడికి వెళ్లి రఘుమన్న సార్‌కు శిష్యులయ్యారు. నల్గొండ జిల్లా చింతపల్లికి చదువుకోవడానికి వెళ్లడంతో అప్పుడు నాకు ఆ అవకాశం రాలేదు. కానీ, ఆ ఏకం గా ఆయనకు తోటి ఆచార్యునిగా ఉండే అదృష్టం కలిగింది. అందరు సిద్ధాంతాలు వల్లిస్తూ, ఇతరులకు బోధిస్తారు. రఘుమ న్న వాటిని నిజ జీవితంలో పాటించి చూ పారు. ఆయన ఉపన్యాసం పిల్లలనూ ఆకట్టుకునేది. స్త్రీ విద్యను ప్రోత్సహించారాయ న.  పరిశోధనాంశాలను నిర్ణయించి ఇవ్వడంలో తనకు తానే సాటి. అందరిలో పర మాత్మను దర్శించిన సమదర్శకుడాయన. నలభై ఏళ్లు ఉద్యోగం చేసినా ఎవకీ తలవంచలేదు. తాను నమ్మిన సిద్ధాంతం నుంచి బుద్ధిని మరల్చలేదు. ఎందరికో మార్గదర్శి, ఆచార్యులకే ఆచార్యుడు.

 -వ్యాసకర్త : ఆచార్య మసన చెన్నప్ప సెల్: 9885654381