ఎల్బీనగర్, ఆగస్టు 30: తనకు దొరికిన నగదును పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చి కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మీనారాయణ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకొని నాగోల్ డివిజన్లోని ఆనంద్‌నగర్ కాలనీకి వెళ్తుండగా రోడ్డపై రూ.60వేల నగదు దొరికింది. ఆ నగదును హయత్‌నగర్ పోలీస్టే షన్లో సీఐ నాగరాజుకు అందజేశారు. సీఐ విచారణ చేపట్టి పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించారు. హయత్‌నగర్‌కు చెందిన మహ్మద్ నూర్‌గా గుర్తించి, రూ.60వేల నగదును అందజేశారు. నిజాయితీగా వ్యవ హరించిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణను సీఐ నాగరాజు అభినందించారు.