calender_icon.png 12 January, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసామాన్య ప్రతిభామూర్తి

16-09-2024 12:00:00 AM

అందమైన స్వదస్తూరితో సాహితీ సృజన చేసే రచయితలు, కవులు చాలా అరుదుగా ఉంటారు. ఈ డిజిటల్ యుగంలో అయితే అసలు పెన్నుతో పనే లేదు. కంప్యూటర్‌పైనో, సెల్లులోనో టైప్ చేయడానికే చాలామంది అలవాటు పడ్డారు. కానీ, ఇటీవలె ఏడు పదులైనా నిండకుండానే అనారోగ్య కారణాలతో దివంగతులైన కవి పండితులు, మహోపాధ్యాయ, శతావధాని, దాశరథి పురస్కార గ్రహీత డా.అయాచితం నటేశ్వరశర్మ గత కొన్ని దశాబ్దాలుగా తన ప్రతీ రచననూ స్వదస్తూరితోనే సృజిస్తుండడం విశేషం.

అది ఎంత పెద్ద వ్యాసమైనా, కవిత్వమైనా ఓపిగ్గా, అక్షరం తప్పు పోకుండా, కొట్టివేతలు లేకుండా, వొంపులు తిరిగినట్టుండే బాపు అక్షరాల శైలిలో ముత్యాలతో ముగ్గులు వేసినంత ఆకర్షణీయంగా రాసేవారు. ముఖ్యంగా చాలావరకు వారి కవితలు ఇలా స్వదస్తూరీతోనే ఆయా పత్రికలలో ప్రచురితమైనాయి కూడా. ఆ అసామాన్య ప్రతిభామూర్తి లేని లోటు తెలంగాణకు పూడ్చలేనిది. వారికి చిరు నివాళిగా‘విజయక్రాంతి పాఠకుల కోసం అయాచితం వారి ఒక నమూనా కవిత్వాన్ని ఇక్కడ పునర్ముద్రిస్తున్నాం.

ఎడిటర్