calender_icon.png 21 September, 2024 | 1:57 AM

లెబనాన్‌లో పేజర్ల పేలుడు

18-09-2024 04:28:55 AM

8 మంది మృతి.. 3 వేల మందికి గాయాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అంతర్యుద్ధంతో నలిగిపోతున్న లెబనాన్‌లో ప్రజల చేతుల్లో ఉన్న పేజర్లే యమపాశాలై ప్రాణాలు తీశాయి. లెబనాన్‌లోని తిరుగుబాటు దళం హెజ్బొల్లా వినియోగిస్తున్న పేజ ర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మంగళవారం దేశవ్యాప్తంగా ఒకే సమయంలో సినిమా సీన్స్‌ల రేంజ్‌లో పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 8 మంది మరణించారు. ఏకంగా మూడు వేల మంది గాయపడ్డారని హెజ్బొల్లా ప్రతినిధి ప్రకటించారు. గాయపడ్డవారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారి మొజ్తాబా అమానీ కూడా ఉండటం గమనార్హం.

గాజా యుద్ధం మొదలైన తర్వాత తన హెజ్బొల్లా సభ్యులెవరూ మొబైల్ ఫోన్లు వాడరాదని ఆ సంస్థ తన సిబ్బందికి ఆదే శాలు జారీచేసింది. ఫోన్ల స్థానంలో సొంతంగా తయారుచేసుకొన్న పేజర్లు, ఎలక్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలు వాడుతున్నారు. మొబై ల్స్ వాడితే ఇజ్రాయెల్ వాటిని హ్యాక్‌చేసి తమ సమాచారం తెలుసుకొనే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే సమయంలో పేజర్లు, సమాచార పరికరాలు పేలిపోవటం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని హెజ్బొల్లా ఆరోపించింది.