calender_icon.png 23 September, 2024 | 5:44 AM

ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు

23-09-2024 02:13:07 AM

50 మందికి పైగా మృతి

టెహ్రాన్, సెప్టెంబర్ 22: ఇరాన్‌లోని ఓ బొగ్గు గనిలో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 50 మందికి పైగా మృతిచెందారు. రాజధాని టెహ్రాన్‌కు 540 మైళ్ల దూరంలోని తబాస బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో గనిలో సుమారు 70 మంది ఉండగా, 50 మందికిపైగా మృతిచెందారని అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కొందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, మరికొందరు శిథిలాల కింద ఉండొచ్చని తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. పేలుడు ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఇరాన్ గనుల్లో పేలుడు సంభవించడం ఇదే మొదటి సారి కాదు. 2013లో ఓ గనిలో పేలుడు సంభవించి 11 మంది, 2011లో మరోగనిలో పేలుడు జరిగి 20 మంది వరకు మృత్యువాత పడ్డారు. 2017లో జరిగిన పేలుడులో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు.