calender_icon.png 30 October, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతల ఐటీ చెల్లింపుపై వివరణ ఇవ్వాలి

18-07-2024 01:20:16 AM

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): సీఎం సహా మంత్రులు పొందే వేతనాలకు ఆదాయపు పన్ను చెల్లించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ఇతర ప్రత్యేక కార్యదర్శుల వేతనాలకు ప్రభుత్వమే ఆదాయపు పన్ను చెల్లించే వెసులుబాటు, పెన్షన్, అనర్హతపై తొలగింపు చట్టం1953 చట్టంలోని సెక్షన్ 3(4)ను సవాలు చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రజలు కూడా పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. కానీ, ప్రభుత్వ హోదాలో క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి పన్ను చెల్లించేలా ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చిం దన్నారు. సమాచార హక్కు కింద పన్ను చెల్లింపు వివరాలను కోరినా గోప్యత కారణాలతో నిరాకరించారని, పన్ను సొమ్ము నుంచి జరిగే చెల్లింపులపై గోప్యత పాటించడం సరికాదన్నారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సేవలకు వేతనాలు పొందే వారందరూ పన్ను చెల్లించాల్సిందేనని, ఇందులో వివక్ష ఉండరాద న్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.