calender_icon.png 22 September, 2024 | 7:24 AM

ఆవిష్కరణలను మెచ్చి ఖరీదైన బహుమతి

07-09-2024 12:59:17 AM

యువశాస్త్రవేత్తకు తన చేతి గడియారాన్ని ఇచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త 14 ఏళ ్లసిద్ధార్థ నంద్యాల ఆవిష్కరణలను మెచ్చిన రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అతడిని తన ఖరీదైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏఐ సదస్సుకు తన తండ్రితో కలిసి హాజరైన సిద్ధార్థ తను రూపొందించిన బయోనిక్ చేతిని మంత్రి శ్రీధర్ బాబుకు ప్రదర్శించారు. దాంతోపాటు తాను అభివృద్ధి చేసిన మరికొన్ని పరికరాలను కూడా చూపించాడు.

హైదరాబాద్ రామాంతాపూర్‌కు చెందిన సిద్ధార్థ కుటుంబం టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో స్థిరపడింది. అక్కడ చదువుకుంటున్న ఈ బాలుడు ఆవిష్కర్తగా అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు సైతం అందుకున్నాడు. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటీవల అమెరికా పర్యటించిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ అక్కడ తమను కలిసిన సిద్ధార్థ్‌ను రాష్ట్రానికి ఆహ్వానించారు. విద్యార్థులకు కృత్రిమ మేథను ఆన్‌లైన్‌లో బోధించేందుకు తాను ప్రభుత్వానికి సహకరిస్తానని మంత్రికు సిద్ధార్థ్ హామీ ఇచ్చారు.