calender_icon.png 24 October, 2024 | 7:50 PM

బీర్ల ధర పెంపునకు కసరత్తు

08-08-2024 12:00:00 AM

వచ్చే నెల నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో సర్కార్  

ఒక్కో బీరుపై గరిష్ఠంగా రూ.15 పెంచాలనే ఆలోచన 

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): అబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.అక్రమ మద్యం, గుడుంబాను నిలవరించడంతో బీర్ల ధరల ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఒక్కో బీరుపై రూ.10 నుంచి రూ.15  వరకు పెంచనునట్టు సమాచారం. ఫలితంగా ఏటా రూ.36 వేల కోట్లుగా ఉన్న ఆదాయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచాలని చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది.

దాన్ని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు విక్రయి స్తుంది. సాధారణంగా రెండేళ్లకోసారి ధరలను ప్రభుత్వం పెంచుకునేందుకు చట్టంలో అవకాశం ఉంది. గతంలో 2022లో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. పార్లమెంట్  ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది. ఇదిలా ఉం డగా, బీర్ల ధరలను ఈ ఏడాది నుంచి రూ. 20 నుంచి రూ. 25 వరకు పెంచాలని బీర్ల ఉత్పత్తి కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. బ్రూవరీల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును రూ.24.08 చొప్పున కొనుగోలు చేసి.. వైన్‌షాపులకు రూ. 116.66కు విక్రయిస్తుంది.