calender_icon.png 17 November, 2024 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినహాయింపు ఇవ్వాల్సిందే: అమన్

14-08-2024 12:05:00 AM

రెజ్లింగ్ అంత సులువు కాదు

న్యూఢిల్లీ: రెజ్లింగ్ కఠినత్వంతో కూడుకున్నది కావడంతో బరువు విషయంలో మినహాయింపు ఇవ్వాల్సిందేనని భారత రెజ్లర్ అమన్ షెరావత్ అభిప్రాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్‌లో అమన్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ 13 తేడాతో ప్యూర్టోరికోకు చెందిన దరియన్‌పై విజయం సాధించాడు. మంగళవారం స్వదేశానికి చేరుకున్న అమన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ రెజ్లింగ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆరు పాయింట్లు కోల్పోయాను.

ఆ సమయంలో నేను ఒలింపిక్ ఆడుతున్నానుకోలేదు. ఇంకా ఏదో స్టేల్ లెవెల్ గేమ్ ఆడుతున్న ట్రాన్స్‌లో ఉన్నట్లు అనిపించింది. కానీ వెంటనే తేరుకున్నా. సెమీస్ ఓటమితో కాంస్య పతక పోరుకు సిద్ధమయ్యా. గెలవడమే లక్షంగా పెట్టుకొని బరిలోకి దిగా. ఇక రెజ్లింగ్ చేయడం కష్టంతో కూడుకున్నది. రెజ్లర్ల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని బౌట్ సమయంలో బరువు విషయంలో మినహాయింపు ఇస్తే బాగుంటుంది.

వినేశ్ కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోవడం దురదృష్టకరం. తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా. కాంస్య పతక పోరుకు ముందు నా బరువు సుమారు 3.5 కిలోలు పెరిగింది. దానిని తగ్గించుకోవడానికి రాత్రంతా మేల్కొని ఉండాల్సి వచ్చింది. కొన్ని నీళ్లు తాగినా బరువు పెరిగిపోతాం. బరువు తగ్గడంలో కోచ్‌లు చాలా కష్టపడ్డారు ’ అని అమన్ చెప్పుకొచ్చాడు.