18-03-2025 01:11:54 AM
జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి
తిమ్మాపూర్ మార్చి 17 విజయక్రాంతి : తెలంగాణ రాష్ట్రంలో సమయపాలన లేకుండా నిరువిరామంగా పనిచేసేదే ప్రభుత్వ ఉద్యోగులని జిల్లా కలెక్టర్ ప్రమేలసత్వతి అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ ఎల్ ఎండి లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన పమేల సత్పతి మాట్లాడుతూ తాను కరీంనగర్ జిల్లాకు కలెక్టర్గా వచ్చినప్పుడు ఉద్యోగుల పనితీరు ఎంతో నచ్చిందని ప్రతి ఒక్కరు కూడా నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ కరీంనగర్ ను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ల ఘనత ఉద్యోగులదే నని కొనియాడారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ తమ హక్కుల కోసం అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై జేఏసీగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
ఏ ఉద్యోగం కూడా అధైర్య పడకుండా ప్రభుత్వానికి 24 గంటలు పని చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ఉద్యోగులు బాధ్యతగా తీసుకొని పాలుపంచుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కలిసికట్టుగా ఏర్పడి తమ హక్కులను సాధించుకునే దిశగా పోరాడుదాం అని పేర్కొన్నారు అనంతరం డైరీ ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపోల్ దేశాయ్, రాష్ట్ర టీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ లక్ష్మణరావు,కరీంనగర్ జిల్లా టిజిఓస్ అధ్యక్షులు కాళీ చరణ్, సెక్రటరీ డా. అరవింద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.