- నెలన్నరలో 17 మరణాలు
- జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం
శ్రీనగర్, జనవరి 21: జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బాదల్ గ్రామంలో వరుసగా సంభవిస్తున్న మరణాలు గ్రామస్థులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గతేడాది డి సెంబర్ 7న తొలిసారిగా మరణా లు సంభవించాయి. గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు సహా ఎనిమిది మంది మిస్టీరిక్ వ్యాధితో ప్రా ణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 17 మంది చనిపోయారు.
ఎంతోమంది గ్రామస్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణాల మిస్టరీ తేల్చేందుకు తాజాగా కేంద్ర హోంశాఖ ఇతర మంత్రిత్వ శాఖల ప్రతినిధులను ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు పంపించింది. ఈ బృందం సోమవారం బాదల్ గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించింది.
బృం దం ఇప్పటివరకు 3 వేల కుటుంబాలను సర్వే చేసింది. నీరు, ఆహార నమూనాలు ల్యాబ్‌లకు పంపించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపడుతున్నది. మరణించిన వారంతా 1.5 కి.మీ పరిధిలో నివసిస్తున్న మూడు కుటుంబాలకు చెందిన వారని గుర్తించారు. వ్యాధిని గుర్తించేందుకు ఐసీఎంఆర్,, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), సీఎస్‌ఐఆర్ రంగంలోకి దిగాయి.