ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
నాగర్‌కర్నూల్, జనవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ వైపు ప్రపంచ దేశాలు చూసి గర్వపడేలా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, జేఎన్టీయూ వీసీ వీ బాలకిష్టారెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్విహిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యావ్యవస్థలో మార్పుల కోసం కృతనిశ్చయంతో ఉన్నారని అందుకే విద్యాశాఖను తనవద్దే ఉంచు కున్నారని గుర్తు చేశారు.
కాలానికి అనుగుణంగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగానే కోర్సులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్, రిలేటెడ్ నూతన సెంటర్లు, ఫార్మా, టూరిజం రిలేటెడ్ కోర్సులను ఉన్నత విద్యలో పొందు పరుస్తున్నట్లు తెలిపారు. జూన్‌ఊ అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే మార్గదర్శకాలను పూర్తి చేసి యూనివర్సిటీల్లో అమలు చేస్తామన్నారు. డిగ్రీ అడ్మిషన్‌లో దోస్త్ వ్యవస్థను తొలగిస్తున్నారన్న వార్తలను నమ్మొద్దని పరిశీలించాకే నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.
విద్యార్థులకు రీడింగ్ మెటీరియల్ కూడా నిపునులతో రీసెర్చ్ చేసి 200పేజీలతో కూడిన బుక్‌లెట్ ఇస్తామని, అవి పోటీపరీక్షలకు కూడా ఉపయోగపడతాయన్నారు. ఐఐఐటీ ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి కోరినట్లు తెలిపారు.
స్థానికుడిగా ఈ ప్రాంత విద్యాభి వృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అట్టడుగు స్థానంలో ఉన్న నాగర్‌కర్నూల్‌ను విద్య రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ కళాశాల ఇతర నూతన కోర్సులను ఏర్పాటుకు మంత్రి జూపల్లి కృష్ణారా వు, ఎమ్మల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.