15-03-2025 10:40:48 PM
ఆటోలో పెద్దపల్లి ఆల్ ఫోర్స్ స్టూడెంట్స్ 8 మందికి గాయాలు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద రాజీవ్ రహదారిపై శనివారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుల్తానాబాద్ ఆల్ ఫోర్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పెద్దపల్లికి చెందిన 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో ఐదుగురికి గాయాలు కాగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, తీవ్ర గాయాలు అయినా ఆదిత్య అనే విద్యార్థిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రతిరోజు వచ్చే ఆటో రాకపోవడంతో, సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద విద్యార్థులు రన్నింగ్ ఆటో ఎక్కినట్టు తెలిసింది. సంఘటన స్థలానికి సుల్తానాబాద్ పెద్దపల్లి పోలీసులు చేరుకొని, క్షతగాత్రులను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.