మహిళ దుర్మరణం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వేగంగా వస్తున్న ఆటో ముందున్న బైక్‌ను తప్పించబోయి పక్క నుంచి వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రత్నబాయ్ (42) అక్కడికక్కడే మృతిచెందగా, ఆటో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మాని యా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.