calender_icon.png 30 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగభద్ర గేటు బిగింపునకు ప్రయత్నం

14-08-2024 02:31:05 AM

ప్రాజెక్టును సందర్శించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా దిగువనకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించారు. సాధ్యమైనంత వరకు నీటిని వదలకుండానే స్టాప్‌లాక్ గేటు బిగించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సాగునీటి రంగ నిపుణుడైన కన్నయ్యనాయుడుతో గేటు బిగించే పనులను ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు చేపట్టాయి.

వరద ప్రవాహంలోనే తాత్కాలిక గేటును బిగించేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కేంద్రం అనుమతులు సైతం తీసుకున్నారు. ఇందుకు జిందాల్ కంపెనీ సహకారం కూడా తీసుకుని భారీ క్రేన్ల సాయంతో వరదలోనే తాత్కాలిక గేట్ బిగించేంపకు ప్రయత్నిస్తామని కన్నయ్యనాయుడు తెలిపారు. గేట్ బిగించగలిగితే ప్రాజెక్టుపై ఆధారపడిన మూడు రాష్ట్రాల రైతాంగానికి శుభవార్త అవుతుంది. మరోవైపు మంగళవారం కూడా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి సుమారు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం దిశగా వదులుతున్నారు.