- కావాలనే సినీ స్టార్‌ను పోలీస్ స్టేషన్‌కు రప్పించారు?
- సీఎం రేవంత్‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు పరామర్శ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): టాలీవుడ్‌ను బోనులో నిలబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్‌ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు.
బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. పెద్దస్టార్ సినిమా విడుదలైనప్పుడు వేలాది మంది వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యమై నా ఒక నిండు ప్రాణం బలైందని, మరో పసిప్రాణం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నద న్నారు.
ఇకనుంచైనా క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్ బాధ్యతాయుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇకపై తొక్కిసలాటకు, మరణాలకు తావులేకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేప ట్టాలని కోరుతున్నానన్నారు. ప్రభుత్వం కావాలనే సినీస్టార్స్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెట్టడం సరికాదని అభిప్రాయ పడ్డారు.
ప్రభుత్వాలకు విశేష అధికారాలు ఉంటాయని, ఎవరినైనా.. ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్నారు. అంతమాత్రాన ప్రభుత్వం ఏది పడితే అది చేస్తామంటే ప్రజలు సహించరని హితవు పలికారు. తాను శ్రీతేజ్ త్వర గా కోలుకోవాలని మాత్రమే కోరుకుంటున్నానని, బాలుడికి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే ఆసుపత్రికి వచ్చామని స్పష్టం చేశారు. ఈటల వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తదితరులున్నారు.