calender_icon.png 16 January, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి

21-10-2024 12:00:00 AM

  1. ప్రతీకారం కోసం ఇజ్రాయెల్ తహతహ
  2. పెంటగాన్ నుంచి పేపర్స్ లీక్

వాషింగ్టన్, అక్టోబర్ 20: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏ క్షణాన్నైనా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడవచ్చని అమెరికా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ సన్నాహాల ప్రణాళికలు అమెరికా పెంటగాన్ నుంచి లీక్ అయ్యాయని ఇరాన్ అనుకూల ‘మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్’ రెండు ఫైల్స్‌ను పోస్ట్ చేసింది.

ఇరాన్‌పై దాడి కి వాడే వెపన్స్‌ను రెడీగా ఉంచినట్లు వాటిలో ఉంది. బాలిస్టిక్, క్షిపణులు, డ్రోన్లతో అక్టోబర్ 15,16 తేదీల్లో ఐడీఎఫ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాక్టీస్ కోసం 16 గోల్డెన్ హారిజోన్ ఎల్‌బీఎం, 40 ఐఎస్ ఏఎల్‌బీఎంలను ఉపయోగించారని వివరించిం ది. అయితే పెంటగాన్ నుంచి లీకైన పేపర్స్ నిజమైనవా కావా అన్న దానిని ఎవరూ నిర్ధారించలేదు.

పేపర్స్ లీక్ కావడాన్ని సీరియస్ అంశంగా పరిగణించాలని పెంటగాన్ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. తమపై అక్టోబర్ 1నాటి దాడికి ప్రతిస్పందనగా ఇరాన్‌లోని ఏయే ప్రాంతాల్లో దాడులు చేయాలో ఇజ్రాయెల్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉందని తెలుస్తోంది.