11-02-2025 05:24:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): హైందవ ధర్మంపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆలయంలో పూజలు చేస్తున్న పూజారులపై కూడా దాడులు నిర్వహించడం హైందవ ధర్మంపై దాడి ఘటనగానే భావిస్తున్నట్టు దిల్వార్పూర్ పూజారుల సంఘం నాయకులు యోగేష్ అన్నారు. మంగళవారం చిలుకూరి బాలాజీ అర్చకుడు సౌందర్య రాజన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భగవంతుని సన్నిధిలో నిత్యం పూజలు నిర్వహిస్తూ భక్తులకు భక్తి మార్గాన్ని చూపెడుతున్న పూజారులను భయభ్రాంతులకు గురిచేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.