calender_icon.png 17 March, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ డీకే అరుణ నివాసంలోకి చొరబడిన ఓ దుండగుడు..

16-03-2025 05:42:12 PM

హైదరాబాద్: బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) నివాసంలోకి ఓ ఆగంతకుడు చొరబడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎంపీ డీకే అరుణ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్(jubilee hills) రోడ్ నెంబర్ 56లో నివాసం ఉంటున్నారు. కాగా, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఓ దుండగుడు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చోరబడ్డాడు. సుమారుగా గంటన్నర పాటుగా ఇంట్లో తిరిగినట్టు నివాసంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 

ఎంపీ డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ ఇచ్చినా వివరాల ప్రకారం... తెల్లవారుజామున మూడు గంటలకు ఇంట్లో పెద్ద శబ్దం వచ్చిందని కాని, ఎవరు కనిపించలేదన్నారు. సీసీ కెమెరాల్లో ఆ దుండగుడు వంటగది కిటికీలో నుంచి వచ్చి, ఎంపీ గది వరకు వెళ్లాడు. కిచెన్ లో పాదముద్రలు ఉన్నాయని, ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని తెలిపారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: ఎంపీ డీకే అరుణ

తన నివాసంలోకి ఆగంతకుడు ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ తెలిపారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్ లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని ఎంపీ వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదని, గతంలో తన నాన్నపై కూడా దాడి జరిగిందన్నారు. భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని డీకే అరుణ తెలిపారు.