16-02-2025 12:00:00 AM
అతను చేయి వేస్తే ఎలాంటి శిలైనా అందమైన శిల్పం కావాల్సిందే. అతని ఉలి దెబ్బకు ఎంతటి కరుకు రాయి అయినా కళాత్మకంగా మారిపోవాల్సిందే. మూడు దశాబ్దాలుగా శిల్పకళా రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు కళాకారుడు ఎమ్.మధుబాబు. అంతేకాదు సామాజిక అంశాలను వారధిగా మలుచుకున్న ఆయన ‘విజయక్రాంతి’తో తన కళా నైపుణ్యం గురించి వివరించారిలా..
మాది పోలీసు కుటుంబం. మా నాన్న. మా చెల్లి డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అయితే నాకు ఆర్ట్‌కు సంబంధించి ఆసక్తి ఎలా వచ్చిదంటే.. మా నాన్న డ్యూటీ నుంచి రాగానే డ్రాయింగ్స్ వేసేవారు. ఎందుకంటే తనకు ఆర్ట్‌లోనే ప్రశాంతత దొరికేది. నిత్యం గందరగోళంగా, ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం కాబట్టి డ్యూటీ నుంచి రాగానే తనకు ఇష్టమైన పనిలో నిమగ్నమయ్యేవాడు.
అలా తనను నుంచి నాకు ఆర్ట్ పట్ల అభిరుచి పెరిగింది. మొదట్లో ఎస్‌ఐ అవ్వాలనే కోరిక ఉండేది. రెండు, మూడుసార్లు ట్రై చేశా. చివరిదశలో కొద్దిపాటి తేడాలో ఉద్యోగాన్ని పొందలేకపోయా. కానీ, చిన్నతనం నుంచే నాకు ఆర్ట్ పట్ల ఇష్టం ఉండేది. స్కూల్‌లో ఏ డ్రాయింగ్ వేసినా మొదటి బహుమతి నాకే వచ్చేది.
యాదాద్రి రాజాపేట దగ్గర రెసిడెన్షియల్ స్కూల్‌లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో.. అప్పటి నుంచి పూర్తిగా ఆసక్తి పెరిగింది. డ్రాయింగ్‌పై టీటీసీ చేశా. అది పూర్తి అవ్వగానే బీఎఫ్‌ఏ చేయాలని జేఎన్టీయూకు వెళ్లా. అప్పుడు హెడ్ ఆఫీసు ఏమో కూకట్‌పల్లిలో ఉండేది. ఆసమయంలో ట్రాన్స్‌ఫోర్ట్‌కు ఇబ్బంది ఉండేది.
ఇంట్లో పెద్దవాణ్ని కాబట్టి..
ఇంట్లో నేనే పెద్దవాణ్ని కాబట్టి బాధ్యతలు ఎక్కువగా నాపై ఉండేవి. ఎందుకంటే నాన్న డ్యూటీ రీత్యా నెలకు, 15 రోజులకు ఒక్కసారి వచ్చేవాడు. చెల్లి, తమ్ముణ్ని, ఇంటి అవసరాల కోసం నాన్న కాలేజీ చాలా దూరంగా ఉంది వద్దన్నారు. నాన్న మాట కాదనలేక.. నల్గొండ ఎన్జీ కాలేజీలో డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేశాను.
అలా చదువుకుంటూ.. తమ్ముడు, చెల్లిని చూసుకున్నా. ఏది చేసినా ఆర్ట్స్ పట్ల ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. నాకు ఏలాగు ఎస్‌ఐ ఉద్యోగం రాలేదని.. చెల్లికి దగ్గర ఉండి ప్రోత్సహించడంలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అయితే కుటుంబ సభ్యులు తమ్ముడు, పెద్దనాన్న కొడుకు ఇద్దరు బీఎఫ్‌ఏ చేశారు.
‘నీకు డ్రాయింగ్ మీద అనుభవం ఉంది కదా.. నువ్వు కూడా ప్రయత్నం చెయ్ అన్న’ అన్నారు. అలా తమ్ముళ్ల ప్రోత్సహంతో.. నేను కూడా బీఎఫ్‌ఏ పూర్తిచేశా. తర్వాత హెచ్‌సీయూలో ప్రయత్నించినా రాలేదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమ్‌ఎఫ్‌ఏ చేశా. బీఎఫ్‌ఏ, ఎమ్‌ఎఫ్‌ఏలో నా స్పెషలైజేషన్ వచ్చేసి స్కల్పర్స్.
ఉడ్, స్టోన్ నా వర్క్..
నా వర్క్ ఎక్కవగా ఉడ్, స్టోన్ మీదనే ఉంటుంది. చిన్న చిన్న మ్యూరల్ వర్క్, సిమెంట్ వర్క్ చేస్తాను. అవి చాలా ఈజీగా కట్ అవుతాయి. వాటిమీద పనిచేయడం కూడా ఈజీగా ఉంటుంది. గ్రానైట్‌లో రెండు రకాలు ఉంటాయి. సాఫ్ట్, హాడ్ గ్రానైట్ అని ఉంటాయి. నేను చేసిన వర్క్‌లో ఎక్కువగా హాడ్ గ్రానైట్‌లే ఎక్కువగా కనిపిస్తాయి. గ్రానైట్‌తో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే స్టేప్ బై స్టేప్ చేయాల్సి ఉంటుంది. త్వరగా పని పూర్తికాదు. కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు ఒక వర్క్ చేయలాంటే కొన్ని నెలల సమయం పడుతుంది. పనిలో చాలా ఒత్తిళ్లు కూడా ఉంటాయి. మనమే స్టోన్ కలెక్ట్ చేసుకోవాలి. మనం చేసే వర్క్ ఏ స్టోన్ అయితే సరిపోతుంది.
దాన్ని తెచ్చుకోవాలి. వర్క్ చేసేముందు మ్యాకెట్ తయారు చేసుకోవాలి. దాన్ని చుసుకుంటూ పనిచేయాలి. స్టోన్ వర్క్ ముందే డిసైడై చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మనం కంప్లీట్ చేశాక.. ఆ ప్లేస్‌ను మనం రీపిల్ చేయడానికి వీలుండదు. ఉడ్ మీద కూడా సేమ్ ఇదే విధంగా వర్క్ ఉంటుంది. ఉడ్ మీద వర్క్ చేసేటప్పుడు డిటెయిలింగ్ చేయాలి.
ఎందుకంటే చిన్న చిన్న చెక్కముక్కలు ఎగిరిపోతుంటాయి. ముఖ్యంగా ఈ వర్క్ చేయడానికి చాలా ఓపిక, ఏకాగ్రత ఉండాలి. ఎందుకంటే మిషన్స్‌తో పనిచేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వొద్దు. కొంచెం ఏమరుపాటుగా ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆవేశంగా పని పూర్తి చేయొద్దు.
సామాజిక అంశాల చుట్టూ..
నా వర్క్ స్టయిల్ ఎలాగుంటందంటే.. చుట్టూ ఉండే సామాజిక అంశాలను, భావోద్వేగాలను, మన సంస్కతీ, సంప్రదాయలకు, మన చుట్టూ జరిగే సంఘటన తీసుకుని వర్క్ చేస్తా.. అదే నా వర్క్ స్టయిల్. న్యూస్, పేపర్ చదువుతున్నప్పుడు దాంట్లో కొన్ని సంఘటలను నేను ఏ విధంగా నా స్టయిల్లో ప్రజెంట్ చేయగలను అని ఆలోచించి స్కెచ్ వేసుకుని దీన్ని ఇలా కూడా చూయించొచ్చు కదా అని వర్క్ చేస్తాను.
ఉదాహరణకు నేను చేసిన వర్క్‌లో చూసినట్లైతే ‘ఆకు వెళ్లి ముళ్లు మీద పడింది’ అనే సామెతను తీసుకుని వర్క్ చేశా. దాన్ని నా స్టయిల్ వర్క్‌లో ఎలా చూపిస్తే బాగుంటుందని చేశా.. దాని కోసం తెల్లమార్బుల్ ను ఎంచుకున్నా.. ఎందుకంటే అది స్వచ్ఛతకు చిహ్నం. ఎన్ని సమస్యలు వచ్చినా.. హాయిగా, ప్యూరిటీగా, క్రమశిక్షణగా ఉండాలని దాన్ని ఎంచుకున్నా.
క్రమశిక్షణ అవసరం..
ఇప్పుడొచ్చే ఆర్టిస్టులకు చేప్పేది ఒక్కటే చేసే పనిలో క్రమ శికణ, సమయపాలన అనేది చాలా అవసరం. ఈ రెండు కచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే ముందుకు వెళ్తారు. ఈ ఫీల్డ్‌లో క్రియేటివిటీ అవసరం.