నిజామాబాద్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు అలిశెట్టి లక్మి నారాయణ, జె శ్రీనివాసరావు లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విడివిడిగా రెండు వినతిపత్రాలు వారికి అందజేశారు. నిజామాబాద్ జిల్లాకోర్టు ఆవరణాను అనుకుని ఉన్న పాత విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని న్యాయస్థానం అవసరాల కోసం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు. పెరిగిన కోర్టుల సంఖ్య,దానికి అనుగుణంగా న్యాయవాదుల, కోర్టు సిబ్బంది కక్షిదారుల వాహనాలు పెరిగి పోవడం వలన జిల్లా కోర్టు ఆవరణ ఇరుకిరుగా మారిపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నది.
జగన్మోహన్ గౌడ్ హైకోర్టు న్యాయమూర్తులకు తెలిపారు. మహిళలపై అత్యాచారాల, హింసను విచారించే ప్రత్యేక న్యాయస్థానం, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, నిజామాబాద్ ఐదవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, నిజామాబాద్ ప్రత్యేక పొక్సో కోర్టు జడ్జిల పోస్ట్ లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయాలని విన్నవించారు. వినతిపత్రాలు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్థులు సానుకూలంగా స్పందించి నట్లు జగన్ తెలియజేశారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి బార్ కోశాధికారి ఏ దీపక్ న్యాయవాది ఆరేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.