calender_icon.png 24 October, 2024 | 4:04 AM

మహాకూటమిలో కుదిరిన పొత్తు

24-10-2024 01:59:48 AM

తలో 85 స్థానాల్లో పోటీ

ముంబై, అక్టోబర్ 23: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో పొత్తు చర్చలు ముగిశాయి. సీట్ల షేరింగ్‌పై కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గాను ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ 3 పార్టీలు కలిపి 255 సీట్లలో పోటీ చేస్తుండగా మిగిలిన 33 సీట్లను కూటమిలో చిన్న మిత్రపక్షాలకు కేటాయించనున్నారు. సీట్ల షేరింగ్‌పై కొన్ని రోజులుగా కూటమిలో విభేదాలు కనిపించాయి. ముఖ్యంగా శివసేన, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. థాకరే వర్గం విదర్భలో కాంగ్రెస్ నుంచి మరో 8 సీట్ల కోసం పట్టుబట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి 17 సీట్లు కావాలని కోరింది. దీంతో సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా జరిగిన చర్చల్లో పంపకాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివసేన (యూబీటీ) 65 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది.