మద్యానికి బానిసైన ఉపాధ్యాయుడు
ఆందోళనలో విద్యార్థులు
కోదాడ (విజయక్రాంతి): ఉపాధ్యాయుడు అంటే పదిమందికి మార్గదర్శం. వారు చెప్పే విద్యాబుద్ధులు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలా అనేకమంది విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్ది ఉన్నత స్థానాలలో నిలబెట్టారు. కానీ కొన్ని చోట్ల ఉపాధ్యాయులు చేస్తున్న పని వల్ల విద్యా వ్యవస్థకు మాయని మచ్చగా కనిపిస్తుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యానికి బానిసై విద్య వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్న ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలో చోటుచేసుకుంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉపేందర్. రామాపురం తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా గత మూడేళ్ళుగా పనిచేస్తున్నాడు.
ఈ ఉపాధ్యాయుడికి మద్యం లేనిదే పూట గడవదు. ప్రతిరోజు పాఠశాలలో మద్యం, ధూమపానం తాగాల్సిందే. నిత్యం పుష్టిగా తాగి తరగతి గదిలోనే పడుకోవడం ఆనావతిల మారింది. విద్యార్థులకు ప్రతిరోజు దినదిన గండంలా మారిన ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు, విద్యార్థులు ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.