- ఉమ్మడి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోల్లో కాలం చెల్లిన వాహనాలే అధికం
- అద్దె బస్సులదీ అదే పరిస్థితి
- ఆదాయం పెరిగినా కానరాని కొత్త బస్సులు
- రోడ్డు మధ్యలోనే మొరాయిస్తున్న సర్వీసులు
- అవస్థలు పడుతున్న ప్రయాణికులు
నిర్మల్, నవంబర్ 17 (విజయకాంతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం అని చెబుతున్న సంస్థ.. ప్రయా ణికులను ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రీజియ న్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సుల్లో సగం కాలం చెల్లినవి కాగా మిగతావి అద్దె బస్సులు.
ఉమ్మడి జిల్లాలో నిర్మల్, భైంసా, ఉట్నూర్. ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఆదిలాబాద్ (ఆరు) డిపోలుండగా.. 3,300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మొత్తం 620 బస్సులు ఉండగా అందులో 309 ఆర్టీసీ.. 311 అద్దె బస్సులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
అద్దె బస్సుల్లో పల్లె వెలుగు 234, ఎక్స్‌ప్రెస్‌లు 75 ఉండగా ఆర్టీసీకి సంబంధించి పల్లె వెలుగు 149, ఎక్స్‌ప్రెస్‌లు 33 బస్సులు ఉన్నాయి. సెమీ డీలక్స్‌లు 4, సూపర్ లగ్జరీలు 88, లహరీ బస్సులు 22, రాజధాని బస్సులు 8 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
15 ఏళ్లు దాటితే బంద్..
ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల కాలం చెల్లిపోయింది. రవాణా శాఖ నిబంధనల ప్రకా రం 15 ఏళ్లు దాటినా.. 13వేల కిలోమీటర్లు తిరిగిన బస్సును వినియోగించకూడదు. కాని ఉమ్మడి జిల్లా రీజియన్ పరిధిలో 13లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 70 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఇందు లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లే ఎక్కువ. బస్సు కండీషన్‌ను బట్టి చిన్న చిన్న పరమ్మతులతో మరో 2 లక్షల కి.మీ.లు నడుపుకునే అవకా శం ఉండగా.. అది పూర్తయిన బస్సులు 40 వరకు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. ఇక ప్రైవేట్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు కలి పి 309 ఉండగా..
అందులో 50 కాలం చెల్లినవే అని అధికారులు తెలిపారు. గడువు ముగిసిన బస్సులను సైతం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు.
ప్రతి రోజు 4౦ లక్షల మందిని చేరవేస్తూ..
బస్సులన్నీ ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, మహారా్రష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. మహాలక్ష్మి పథకం అమలు తరువాత ప్రయాణికుల రద్దీ పెరిగినా బస్సు సర్వీసుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఫలితంగా ప్రయాణికు లు, ఆర్టీసీ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ప్రతి రోజూ 3.50 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 40 లక్షల మంది ని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీకి సుమారు రూ.2 కోట్ల మేర ఆదాయం సమకూరుతున్నది.
రోడ్డుపైనే మొరాయింపు..
ఉమ్మడి జిల్లాల్లో కాలం చెల్లిన బస్సు లు తరుచుగా మొరాయిస్తూ ప్రయాణికుల ఓపికను పరీక్షిస్తున్నాయి. పలు సమస్యలతో మధ్యలోనే ఆగి పోతున్నాయి. సీటు కెపాసిటీ 55 కాగా 100 నుంచి 140 మంది ప్రయాణం చేయ డం ఇందుకు ఇక కారణమని చెప్పవ చ్చు. గతంలో సగటున రోజుకు 380 కి.మీ.లు తిరిగే బస్సులు ప్రస్తుతం 420 కి.మీ.ల నుంచి 500కి.మీ.ల వరకు తిరుగుతుండడంతో సమస్యలు ఎక్కువైనట్టు డ్రైవర్లు వాపోతున్నారు.