- 1,375 సేవల ధరల సవరణకు ప్రభుత్వ నిర్ణయం
- ఖజానాపై భారం 600 కోట్లు
- వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ వెల్లడి
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్యాకేజీల ధరలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. మొత్తం 1,375 ప్యాకేజీల ధరలను సవరించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. సోమవారం సచివాలయంలో మీడియా సమావేశంలో సవరించిన ధరల వివరాలను తెలియచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ప్యాకేజీ ధరలను సవరించినట్లు తెలిపారు. 1,672 రకాల చికిత్సలకు సంబంధించి 1,3 75 ప్యాకేజీల ధరలను సుమారు 22 శాతంపైగా పెంచామని మంత్రి వివరించారు. సవరించిన ధరల వల్ల ఖజానాపై రూ.140 కోట్ల భారం పడుతోందన్నారు.
ఇక గతంలో లేని 163 కొత్త చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని, ఇవన్నీ ఖరీ దైన సూపర్ స్పెషాలిటీ చికిత్సలని మంత్రి వెల్లడించారు. కొత్తగా చేర్చిన చికిత్సల ప్యాకేజీల కోసం ప్రభుత్వంపై అదనంగా రూ.438 కోట్లు భారం పడుతోందన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వంపై 54 శాతం భారం పడుతోందన్నారు. ధరల సవరణలో కొన్ని ప్యాకేజీలపై సుమారు 50 శాతం కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఎంత భారం పడినా సామాన్యులకు మెరుగైన వైద్యం అందించి వారిని కాపాడుకోవడమే తమ బాధ్యతని మంత్రి తెలి పారు. ప్రతి కుటుంబంపై సుమారు రూ.5 నుంచి 6 లక్షల వరకు వెచ్చించేందుకు తమ సర్కారు సిద్ధమైం దన్నారు.
12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సేవ ల కోసం ధరలు పెంచలేదని, ఇప్పు డే పెంచారని స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రధాన కార్యదర్శి గోవింద్‌హరి తెలిపారు. అందుకోసం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సవరించిన చికిత్సల్లో అత్యధికంగా రుమటాలజీ చికిత్స ప్యాకేజీ రూ.5 లక్షలు కాగా ఇంటర్వెన్షన్ రేడియాలజీ రూ.2,6 2,500, హృద్రోగ సంబంధ సర్జరీకి రూ.2,32,700, నెఫ్రాలజీ రూ. 22,500, ప్లాస్టిక్ సర్జరీ రూ.2,00, 000, న్యూక్లియర్ మెడిసిన్ రూ.1, 20,000, న్యూరో సర్జరీ రూ.1,12, 500 ప్యాకేజీ ధరలు నిర్ణయించారు. సవరించిన ధరల వల్ల సామాన్యులకు స్పెషాలటీ చికిత్సలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు.