25-01-2025 12:00:00 AM
న్యూఢిల్లీ: ప్రముఖ డెయిరీ బ్రాండ్ అమూల్ పాల ధరల్ని తగ్గించింది. మూడు రకాల పాలపై లీటరుకు రూపాయి చొ ప్పున తగ్గింపు ప్రకటించింది. కంపెనీ అం దిస్తోన్న ప్రధాన పాల ఉత్పత్తులు అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్‌పై ఈ తగ్గింపు ఉంటుందని పేర్కొంది.
ఈ విషయాన్ని అమూల్ పేరిట పాలను విక్రయించే గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయే న్ మెహతా వెల్లడించారు. ధరల తగ్గింపు తర్వాత అమూల్ గోల్‌ల్డ్ ధర రూ.65 (ఒక లీటరు), అమూల్ టీ స్పెషల్ ధర రూ.61, అమూల్ తాజా ధర రూ.53గా ఉంది. ధరల తగ్గింపు నిర్ణయం వెనుకున్న కారణాన్ని అమూల్ వెల్లడించలేదు.