హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): ఆంధ్రా మహిళా సభ (ఏఎంఎస్) స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్ 17వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్‌పర్సన్ డా.ఏ రామాదేవి మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తమ కాలేజీలో బీబీఏ కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. విద్యార్థినులు వివిధ కార్యక్రమాల్లో బహుమతులు పొంద డం అభినందనీయమన్నారు. కార్యక్రమం లో కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, కాలేజీ పాలకమండలి సభ్యులు డా.సీవీ. రామ్మోహన్ పాల్గొన్నారు.