వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, జనవరి 3 (విజయక్రాంతి): సంగారెడ్డిలో రూ.44 కోట్లతో అమృత్ జలపథకం ద్వారా తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటింటికి మంచినీరు అందించేందుకు అమృత్ జల పథకం, మహిళల సంక్షేమం కోసం మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.
తదనంతరం సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన 11 అంబులెన్సులను మంత్రి ప్రారంభించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్‌డీవో జ్యోతి, ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.