- గద్వాల ప్రజలకు నాణ్యమైన మంచి నీటి సరఫరా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
- అమృత్ 2.0 పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలులోకి వచ్చింది: ఎంపీ మల్లు రవి
గద్వాల, జనవరి 24 ( విజయక్రాంతి ) : గద్వాల మున్సిపల్ పరిధిలో వచ్చే 50 సంవత్సరాల వరకు త్రాగునీటి సమస్య తరతకుండా అమృత్ 2.0 పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
శుక్రవారం గద్వాల పట్టణంలో నది అగ్రహారం ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.O పథకం ద్వారా మంచి నీటి సరఫరా అభివృద్ధి పనులకు గద్వాల్ స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డా.ఆర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సంద ర్భంగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి అమృత్ 2.0 పథకం అత్యంత ప్రధానమైనదని, గద్వాల్ మునిసిపాలిటీలో తాగునీటి సమస్యల పరిష్కారానికి అమృత్ 2.0 పథకం కింద రూ. 63.25 కోట్ల వ్యయంతో నీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ. 28.75 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ సంస్థలు రూ. 34.50 కోట్ల భాగస్వామ్యంతో పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే 50 సంవత్సరాల వరకు గద్వాల్ పట్టణ ప్రజలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అమృత్ 2.0 పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలులోకి వచ్చిందని, గద్వాల్ పట్టణ ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా లక్ష్యంగా ఇది రూపుదిద్దుకుందణి ఎంపీ మల్లు రవి అన్నారు. సాంకేతికతను ఉపయోగించి నీటిని లిఫ్ట్ చేయడం,పైపుల ద్వారా ప్రతి ఇంటికి నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. మెగా కాంట్రాక్టు అధికారులకు ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం,రైతు భరోసా,రేషన్ కార్డ్ కోసం దరఖాస్తులు స్వీకరించబడుతాయన్నారు.ఈ పథకాల ద్వారా ప్రతి అర్హుడుకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమృత్ 2.0 పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించబడుతుందని,ఈ పథకం ద్వారా గద్వాల్ ప్రజలకు నాణ్యమైన మంచి నీటి సరఫరా కల్పించబడుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం గద్వాల్ పట్టణంలో ఉన్న వాటర్ స్కీమ్ గత 40 సంవత్సరాల క్రితం అమలులోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ పథకం 50 సంవత్సరాల పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో గద్వాల్ ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చూడడం అమృత్ 2.0 పథక ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవులు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పబ్లిక్ హెల్త్ ఈmఈ. విజయ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ దశరథ్, కౌన్సిలర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.